బెంగాల్ నిండి భాగ్యనగరం వరకు బీజేపీది ఒకే నినాదం

పాకిస్తాన్ బాంగ్లాదేశ్ మయన్మార్ నిండి వచ్చిన ముస్లింలకు ఆయా ప్రాంతాల్లో బలంగా ఉన్న పార్టీలు అండగా ఉంటున్నాయి. తామైతేనే వారిని ఏరి పారేయగలం అని వారి వాదన

ఒక్క నిమిషం వారి వాదన నిజమే అనుకుందాం. లోక్ సభ లో హోమ్ మంత్రి అమిత్ షా అన్నట్టుగా దేశాన్ని పట్టి పీడిస్తున్న ఆ చీడ పురుగుల్ని పట్టుకున్నారే అనుకుందాం

వారిని మూటగట్టి వారి మాతృదేశానికి పంపించేయగలమా ?

అది సాధ్యం కాదు ఎందుకు అంటే, వారు తాము భారతీయులమే అని వాదిస్తారు. అది నిజం కాదు అని నిరూపించడం సాధ్యం అయ్యే పని కాదు. సరే తలకిందులు గా తపస్సు చేసి వారు ఫలానా దేశానికి చెందిన వారు అని మనం నిరూపించినా (బాంగ్లాదేశ్ అనుకుందాం ) ఆ దేశం ఒప్పుకోకపోతే వారిని అక్కడికి తరలించలేం.

అప్పుడు వారు ఏ దేశానికీ చెందిన వారు కాదు అని తీర్మానించాలి. అలా తీర్మానించిన వారు అంతర్జాతీయ ఒప్పందాల కిందకి వస్తారు. వారికీ కనీస సౌకర్యాలు భారత ప్రభుత్వమే కల్పించాలి. అది చాల ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అలాగే ఇలాంటి వ్యవహారాలు తప్పుల తడకగా ఉంటాయి. భారత పౌరులైన ఏంతో మంది ఈ జాబితాలో చేరతారు.

కోట్లాను కోట్లు తగలబోసి , మన పౌరులని మన పౌరులు కాదు అని తీర్మానించి మరల వారిపై కోట్లను కోట్లను ఖర్చుపెట్టడమే ఎన్ ఆర్ సీ

Please follow and like us:

You may also like