మెగా బ్రదర్ నాగబాబు 3 దశాబ్దాలుగా తెలుగు ఇండస్ట్రీలో ఉన్నా, ఇండస్ట్రీ పద్ధతులు ఒక్కటి కూడా అలవర్చుకోలేదు. ఎప్పుడు ఎదో ఒక వివాదం రేపి దానికి సంబదించిన మీడియా హడావిడితో పాపులారిటీ పొందుతూ ఉంటాడు. నాగబాబు జబర్దస్త్ రాక ముందు మెగా ఫాన్స్కి తప్ప ఎవరకి పెద్ద పరిచయం లేని వ్యక్తి.

2009 లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అక్కడ టికెట్ ఆశించి వచ్చిన వాళ్ళు చాలా మంది ఈయనతో సినిమాలో తీశారు. ఒకసారి నాగబాబు సినీ చరిత్ర చూడండి, ప్రజారాజ్యం స్థాపనకు ముందు ఈయన హీరో గా చేసిన సినిమాలు ఆ తర్వాత చేసిన సినిమాలు పోలిస్తే మీకే అర్ధం అవుతుంది. ప్రజారాజ్య స్థాపనలో అందరికన్నా ఎక్కువ లబ్ది పొందింది నాగబాబే.


నాగబాబు గొడవ పెట్టుకొని మనిషి ఎవరన్నా ఉన్నారా, మా ఎలక్షన్స్ లో ముందల మురళి మోహన్ ని పిచ్చి తిట్టులు తిట్టి శివాజీరాజా కి సపోర్ట్ చేసాడు, మల్ల శివాజీ రాజాని తిట్టాడు…తనకి ఈ అవకాశం లేకుండా ఉన్న టైంలో అన్నం పెట్టిన మల్లెమాల గురుంచి ఎంత నీచంగా మాట్లాడాడో మనకి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీ మరియు ఇండస్ట్రీలో ఉన్న సంస్థలతో గొడవలు పెట్టుకొని తన చిన్న బుద్దిని ఎప్పటికి అప్పుడు బైట పెట్టుకుంటాడు నాగబాబు.

ఈయన వల్ల మెగా కుటుంబానికి, మెగా ఫాన్స్ కి తలవంపులు తప్ప, పైసా ఉపోయోగం లేదు…ఈయన చేసిన చండాలన్నీ కడగలేక సతమవుతున్నారు ఫాన్స్

Please follow and like us:

You may also like