హిందీ రాని వారి భారతీయత ను ప్రశ్నించే సంస్కృతి రోజు రోజు కీ పెరుగుతుంది. అసలు నువ్వు భారతీయుడివేనా ? ఇదీ హిందీ రాని వారికీ తరచూ ఎదురయ్యే ప్రశ్న.

ఇటీవల తమిళ నాడు నాయకురాలు , డీఎంకే పార్టీకి చెందిన కనిమొళికి విమానాశ్రయం లో ఎదురైన చేదు అనుభవమే ఇందుకు నిదర్శనం. అయితే ఇది మొదటిది కాదు చివరిది కాబోదు.

మన తెలుగువాడు అయిన హరికృష్ణ గారు రాష్ట్ర విభజన సందర్భంలో పార్లమెంటు లో ‘నా రాష్ట్ర ప్రజలకు అర్థం అవ్వాలి నేను తెలుగు లోనే మాట్లాడతాను’ అంటే అప్పటి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ నానా యాగీ చేశారు. కొసమెరుపు ఎంటి అంటే కురియన్ గారు కూడా మన దక్షిణ భారతీయుడే కావటం. దక్షిణ భారతీయుల మధ్య లోపించిన ఐక్యతను ఆసరాగా చేసుకుని ఉత్తరాది రాజకీయ నాయకులు మనపై హిందీని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు.

దక్షిణ భారతదేశంలో తమిళం కాక మరో ఐదారు భాషలు మాట్లాడతారు అనే కనీస జ్ఞానం కూడా ఉత్తరాది వారికి లేకపోవటం శోచనీయం. ఈ పరిస్థితి మారాలి అంటే తెలుగు వారు ఇంకా చెప్పాలి అంటే దక్షిణాది వారు ఐక్యం అవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది.

హిందీ మాట్లాడని వాడు భారతీయుడే కాదు అనే తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టి నేను తెలుగు వాడిని నేను భారతీయుడిని అని బల్లగుద్ది చెబుదాం.

Please follow and like us:

You may also like