బండ్ల గణేష్… తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైన పేరు

కమెడియన్ గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టి

పవన్ కళ్యాణ్ దయతో నిర్మాత స్థాయికి ఎదిగి

రాజకీయాల్లో పీక కొసుకునే ప్రమాదం నిండి బయట పడి

ప్రస్తుతం తనకు ఏ పార్టీతో సంబంధంలేదు అని ట్వీట్ లతో కాలక్షేపం చేస్తున్న వ్యక్తి

చిన్న చిన్న కామెడీ పాత్రలు వేసుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ లాంటి అగ్రహీరో సినిమా నిర్మించే స్థాయికి ఎదిగాడు అంటే దాని వెనక ఎంత కష్టం దాగి ఉండి ఉంటుంది.

ఆ కథ అందరికి తెలిసేలా ఒక పుస్తకం రాసి , అచ్చు వేసి , అమ్మకానికి పెడితే , అది చదివి ఆంధ్ర తెలంగాణ ప్రజలు పులకిస్తారు

ఇంగిలీషులోకి అనువదిస్తే , ఎదో ఒక హాలీవుడ్ దర్శకుడు ఆ పుస్తకాన్ని చదివి సినిమాగా మలిచే అవకాశమూ లేకపోలేదు.

బహుశా సైనిమా కి మసాలా దట్టించడం కోసం ఇజయనగరం సత్తిబాబు , జబ్బర్దస్తు ఎమ్మెల్యే గారి పాత్రలకు కూడా అందులో దర్శకుడు స్థానం కల్పించే అవకాశం ఉంది.

హాలీవుడ్డు సినిమా స్థాయి ఉన్న వ్యక్తిని ఆరాధించడం లో తప్పేముంది అనుకున్నారేమో ..పార్టీలకు అతీతంగా బండ్ల గారి ఫై అభిమానం కురిపిస్తూ ఉంటారు ట్విట్టరు జీవులు

Please follow and like us:

You may also like