మరోసారి చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం ఎత్తుకున్నారు. తెలుగు మాధ్యమం ఇంగ్లీషు మాధ్యమం  విద్యా వ్యవస్థకి రెండు కళ్ళు అంటూ చెప్పుకొస్తున్నారు. క్రమక్రమంగా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెడుతూనే తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలి అనేది అయన వాదన. అయితే అయన వాదన ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అయన వ్యతిరేకమో అనుకూలమో తెలియక తలలు పట్టుకుంటున్నారు. 

సాధారణంగా ఏదైనా విషయంలో ఇబ్బంది పడినప్పుడు చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతాన్ని అందుకుంటారు. తెలంగాణ ఉద్యమం అపుడు అయన తటస్థ వైఖరిని ప్రదర్శించి అందరినీ గందరగోళంలో పడేసిన విషయం తెలిసిందే. అదే రకంగా ఆంగ్ల మాధ్యమం విషయంలో అయన తటస్థ వైఖరిని తీసుకోవటంతో ప్రజలు గందరగోళానికి గురయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఆంగ్ల మాధ్యమం ప్రవేశం అయన హయాంలోనే ఆరంభం అయ్యింది కనుక అయన కొంత ఆత్మరక్షణలో పడ్డట్టు కనపడుతుంది. ముందే చెప్పుకున్నట్టు ఈ విషయంలో జగన్ మోహన్ రెడ్డిదే చివరికి పై చేయి అయ్యింది. 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like