
వైవిధ్యమైన కథలు, సినిమాలు చేసే అవకాశం ఉన్న మీడియం రేంజ్ సినిమాలలో నాని తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ని ఏర్పరుచుకున్నాడు. చాలా వరకు తన సినిమాల్లో కొంచెం వైవిధ్యం ఉండేలా టైటిల్స్ లో కానీ, కథలో గాని చూసుకుంటాడు. మిగిలిన హీరోలు చేయడానికి తటపటాయించే కథలు చేయడానికి కూడా ముందుంటాడు.
ఇప్పుడు తన 26వ చిత్రంగా చేస్తున్న సినిమా టైటిల్ “టక్ జగదీష్” కూడా వెరైటీగా ఉంది. ఫస్ట్ లుక్ కూడా ఆకట్టుకునేలా ఉంది. తనతో “నిన్నుకోరి” అలానే “మజిలి” లాంటి వైవిధ్య భరిత సినిమాలు తీసిన “శివ నిర్వాణ” ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ కూడా క్లాస్ ని మాస్ ని టచ్ చేసేలా కనిపిస్తోంది.

టైటిల్, ఫస్ట్ లుక్ లాగానే సినిమా కూడా వైవిధ్యమైన కథనంతో, కథతో జనాలని ఆ కట్టుకోవాలని కోరుకుంటూ తెలుగు డైజెష్ట్ ఆల్ ద బెస్ట్ చెబుతోంది.